Tuesday, October 4, 2022
Tuesday, October 4, 2022

హైదరాబాద్‌లో వరల్డ్‌ క్లాస్‌ సైకిల్‌ ట్రాక్‌కు శంకుస్థాపన చేసిన కేటీఆర్‌

వరల్డ్‌ క్లాస్‌ సైక్లింగ్‌ ట్రాక్‌కు తెలంగాణ మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ మంగళవారం భూమి పూజ చేశారు. హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు మీద నానక్‌ రామ్‌ గూడ, తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడెమీ, నార్సింగి, కొల్లూర్‌ ల సమీపంలో 23 కిలోమీటర్ల మేర వరల్డ్‌ క్లాస్‌ ప్రమాణాలతో ఈ సైక్లింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు కానుంది. ఈ ట్రాక్‌ వెంట పైన మొత్తంగా సోలార్‌ ప్యానెళ్లు ఏర్పాటు కానుండగా… ఆ ప్యానెళ్ల నీడలో సైక్లింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు కానుంది. ఈ సోలార్‌ ప్యానెళ్ల ద్వారా 16 మెగా వాట్ల విద్యుదుత్పత్తి జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. పర్యావరణానికి అనుకూలంగా ఉండే.. ప్రజాఉపయోగమైన నాన్‌ మోటరైజ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సెల్యూషన్స్‌ను ఉద్దేశంతో ట్రాక్‌ను శంకుస్థాపన చేశామన్నారు.కేవలం ఆరు నెలల్లోనే ఈ ట్రాక్‌ను పూర్తి చేయనున్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు. ఇదివరకే ఇచ్చిన హామీ మేరకు ఈ ట్రాక్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ 23 కిలోమీటర్ల నిడివి కలిగిన ట్రాక్‌ ప్రారంభమేనన్న కేటీఆర్‌… భవిష్యత్తులో ఇలాంటి ట్రాక్‌లను నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తామని వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img