Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

హైదరాబాద్‌కు వచ్చేందుకు ఎదురుచూస్తున్నా..

నగరంలో పర్యటనపై ప్రధాని మోడీ ట్వీట్‌!
నేడు ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఆయన పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరోవైపు తన పర్యటన వివరాలను మోదీ ట్విట్టర్‌ ద్వారా వెల్లడిరచారు. నగరంలో రెండు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు మోదీ పేర్కొన్నారు. రెండు కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం కోసం హైదరాబాద్‌ వెళ్తున్నానని తెలిపారు. మధ్యాహ్నం 2.45 గంటలకు ఇక్రిశాట్‌ 50 ఏళ్ల ఉత్సవాలకు హాజరవుతానని ఆయన చెప్పారు. వ్యవసాయం, ఆవిష్కరణల రంగంలో ఈ సంస్థ విశేషమైన కృషి చేస్తోందని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు స్టాచ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీని ఆవిష్కరించే కార్యక్రమంలో పాల్గొంటానని చెప్పారు. తన పవిత్రమైన ఆలోచనలు, ఆథ్యాత్మిక బోధనలతో మనల్ని ఉత్తేజితం చేసిన రామానుజాచార్యుల వారికి ఇది ఘన నివాళి అని పేర్కొన్నారు. ప్రధాని పర్యటనలో సీఎం కేసీఆర్‌ పాల్గొననున్నారు. తొలుత శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రధానికి సీఎం స్వాగతం పలుకుతారు. ఆయన వెంట హెలికాఫ్టర్‌లో ఇక్రిశాట్‌కు, అనంతరం ముచ్చితల్‌కు వస్తారు. ప్రధాని కార్యక్రమాలన్నింటిలో పాల్గొనడంతోపాటు ఆయన విమానాశ్రయం నుంచి తిరుగు ప్రయాణమయ్యే సమయంలో వీడ్కోలు పలికే వరకూ ముఖ్యమంత్రి మోదీ వెంటే ఉంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img