Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

హైదరాబాద్‌ నగరంలో భారీస్థాయిలో మాదకద్రవ్యాలను పోలీసులు పట్టుకున్నారు. రెండు వేర్వేరు ఘటనల్లో పోలీసులు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రూ. 5.50 కోట్ల విలువైన డ్రగ్స్‌ను సీజ్‌ చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ మీడియాకు వెల్లడిరచారు. 14.2 కిలోల సూడో ఎపిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ డ్రగ్స్‌ను కలిగి ఉన్న ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. డీఆర్‌ఐ సమాచారంతో బేగంపేటలోని ఇంటర్నేషనల్‌ పార్శిల్‌ కేంద్రంలో తనిఖీలు చేసి, మాదకద్రవ్యాలను సీజ్‌ చేసినట్లు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి ఆస్ట్రేలియాకు పంపించేందుకు అనుమానం రాకుండా ఫోటో ఫ్రేమ్స్‌లలో పెట్టి ప్యాకింగ్‌ చేశారని పేర్కొన్నారు. డీఆర్‌ఐ ఇచ్చిన సమాచారం మేరకు కొరియర్‌ చేసేందుకు సిద్దంగా ఉన్న 22 ఫోటో ఫ్రేమ్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కొరియర్‌ చేసేందకు నకిలీ ఆధార్‌ను ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img