Thursday, October 6, 2022
Thursday, October 6, 2022

హైదరాబాద్‌-తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ అధికారులు తిరుమల భక్తుల కోసం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్‌- తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. సెప్టెంబర్‌ 16న హైదరాబాద్‌ నుంచి తిరుపతికి, 17న తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వెల్లడిరచారు. వీటితోపాటు నాగర్‌సోల్‌- హైదరాబాద్‌, నర్సాపూర్‌-యశ్వంత్‌పూర్‌ మధ్య స్పెషల్‌ ట్రెయిన్‌లు నడుపుతున్నట్లు ప్రకటించింది. నేడు హైదరాబాద్‌ నుంచి నాగర్‌సోల్‌కు, ఈ నెల 15న నాగర్‌సోల్‌ నుంచి హైదరాబాద్‌కు, బుధవారం నర్సాపూర్‌ నుంచి యశ్వంత్‌పూర్‌కు వెళ్లే రైలు, గురువారం యశ్వంత్‌పూర్‌ నుంచి నర్సాపూర్‌కు బయలుదేరుతుందని అధికారులు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img