Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

హైదరాబాద్‌ పేలుళ్ల కుట్రకోణంలో కొత్త మలుపు

హైదరాబాద్‌ పేలుళ్ల కుట్రకోణంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. తాజాగా ఉగ్రవాదులకు ఆర్థిక సాయం చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాతబస్తీకి చెందిన అబ్దుల్‌ కలీమ్‌ ను అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌ కు తరలించారు. హైదరాబాద్‌ లో నరమేధం సృష్టించేందుకు ముగ్గురు ఉగ్రవాదులు కట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. జాహిద్‌ తో పాటు ముగ్గురుని గతంలోనే అరెస్ట్‌ చేసిన పోలీసులు జాహీదు అబ్దుల్‌ కలీమ్‌ కు రూ.40 లక్షలు ఆర్థిక సాయం చేసినట్లు తేల్చారు.కలీమ్‌ ఇచ్చిన రూ.40లక్షలతో కార్లు, బైక్‌ లను జాహీద్‌ కొనుగోలు చేసినట్లు సమాచారం. విదేశాల నుంచి వచ్చిన హ్యాండ్‌ గ్రానేడ్లతో పేలుళ్లకు జాహీద్‌ ముఠా భారీ కుట్ర పన్నినట్లు పోలీసులు గుర్తించారు. కార్లు, బైక్‌ లలో హాండ్‌ గ్రానేడ్లు పెట్టి పేల్చేందుకు ఈ ముఠా ప్లాన్‌ చేసిందని, దసరా ఉత్సవాలతో పాటు హైదరాబాదులో జరిగే ఉత్సవాల్లో పేలుడుకు కుట్ర పన్నిందని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే హైదరాబాద్‌ పేలుళ్ల కుట్ర కేసుపై ఎన్‌ఐఏ విచారణ చేస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img