హోలీ సందర్భంగా హైదరాబాద్లో పోలీసులు ఆంక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలు నిషేధించారు. భవనాలు, వాహనాలపై రంగులు పోయవద్దని,అపరిచితులపై రంగులు వేయరాదని నిబంధనలు విధించారు. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్లు మూసివేశారు. హోలీ సందర్భంగా శనివారం ఉదయం 6 గంటల వరకు మద్యం అమ్మకాలు నిషేధించారు.