Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అంతా ఫేక్‌

హైదరాబాద్‌ అత్యాచార ఘటనలను చేధించిన పోలీసులు
హైదరాబాద్‌లో జరిగిన రెండు అత్యాచార ఘటనలను పోలీసులు చేధించారు. గాంధీ ఆస్పత్రి, సంతోష్‌ నగర్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసుల ఫిర్యాదులో వాస్తవం లేదని, అంతా కట్టుకథ అని తేల్చారు. గాంధీ ఆస్పత్రిలో మహిళపై అత్యాచారం జరిగిన ఆధారాలు లభించలేదని వెల్లడిరచారు. ఈ కేసులో 500కి పైగా సీసీ కెమెరాలు పరిశీలించినట్లు తెలిపారు. 800 గంటల సీసీ ఫుటేజ్‌లు చూడటం జరిగిందని, టెక్నాలజీ ఆధారంగా సెల్‌ ఫోన్‌ సిగ్నల్స్‌ చూసినట్లు పేర్కొన్నారు. ఈ ఆధారాల దృష్ట్యా దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహిళలు చేసిన ఆరోపణలు అవాస్తమని తేల్చారు. అక్కా చెల్లెల్లిద్దరికీ కల్లు తాగే అలవాటు ఉందని పోలీసులు తెలిపారు. అక్క ఆస్పత్రి నుంచి వెళ్లిపోవడంతో చెల్లెలు అక్కడే ఉండిపోయిందన్నారు. కల్లు తాగి అపస్మారక స్థితిలో ఉన్న చెల్లి.. అక్క విషయాన్ని దాచిపెట్టేందుకు అత్యాచారం కథ అల్లినట్లు వెల్లడిరచారు.
ఇక సంతోష్‌నగర్‌ కేసులో కూడా అత్యాచార ఆరోపణలు అవాస్తవమని తేలింది.తనపై సామూహిక అత్యాచారం జరిగిందని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆమెపై అత్యాచారం జరగలేదని తేలింది. తాను ప్రేమించిన ప్రియుడు.. పెళ్లి చేసుకోనని చెప్పడంతో అతన్ని ఎలాగైనా పోలీసు కేసులో ఇరికించాలని సదరు యువతి అత్యాచారం కథకు తెర లేపింది. ప్రియుడిపై కోపంతోనే ఈ కట్టుకథ అల్లినట్లు ఆమె పోలీసుల ఎదుట ఒప్పుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img