Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

అగ్రి ఇన్నొవేషన్‌ హబ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

ప్రొఫెసర్‌ జయశంకర్‌ యూనివర్శిటీ ప్రాంగణంలో నిర్మించిన అగ్రి ఇన్నొవేషన్‌ అగ్రిహబ్‌ను మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం అగ్రిహబ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌, ఉత్పత్తులను పరిశీలించారు.రూ.9 కోట్ల నాబార్డ్‌ సాయంతో దీనిని నిర్మించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ, తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేందుకు రాష్ట్ర సర్కార్‌ ప్రయత్నిస్తోందని అన్నారు. అగ్రిహబ్‌ను 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. రోబోటిక్‌ విధానంలో కలుపు తీయడం, డ్రోన్‌ల ద్వారా పంటలో తెగుళ్లను గుర్తించడం వంటి సమాచారం అందుబాటులో ఉంటుంది. గ్రామీణయువత, మహిళలు, రైతులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అగ్రిబిజినెస్‌ మెళకువలు నేర్చుకునేందుకు గ్రంథాలయంగా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో నాబార్డ్‌ చైర్మన్‌ గోవిందరాజులు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌ గౌడ్‌, మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, సుధీర్‌ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img