Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

అర్థంలేని విమర్శలు చేస్తే సహించం : మంత్రి సత్యవతి రాథోడ్‌

అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారన్నారు. కానీ, ప్రతిపక్షాలు మాత్రం పసలేని విమర్శలు చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ విమర్శించారు. రేగొండ మండలం పోచంపల్లి గ్రామంలో నీతి అయోగ్‌ కింద మంజూరైన 10 లక్షల రూపాయలతో అంగన్‌వాడీ భవనాల మరమ్మతుల పనులను మంత్రి సత్యవతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారన్నారు. కానీ, ప్రతిపక్షాలు మాత్రం పసలేని విమర్శలు చేస్తూ ప్రభుత్వంపై బురదజల్లుతున్నాయని విమర్శించారు. తెలంగాణలో దేశంలో ఎక్కడలేని విధంగా సుపరిపరిపాలన సాగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిపక్షాలు విలువైన సూచనలు చేస్తే తీసుకుంటామన్నారు. అంతేకాని అర్థంలేని విమర్శలేని చేస్తే సహించమన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం అందరూ కలిసి రావాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ భవిష్‌ మిశ్రా, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ దివాకరం, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img