Friday, April 19, 2024
Friday, April 19, 2024

అవినీతి అధికారులకు ఎమ్మెల్సీ పదవులు : రేవంత్‌రెడ్డి

అవినీతి అధికారులకు ఎమ్మెల్సీ పదవులు ఇస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అనాÊ్నరు. వెంకట్రామి రెడ్డి రాజీనామాను ఆమోదించేందుకు వీల్లేదు. ఆయన ఎమ్మెల్సీ నామినేషన్‌ తిరస్కరించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రేవంత్‌ పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్‌ కలెక్టర్‌గా వెంకట్రామిరెడ్డి భూఅక్రమాలకు సహకరించారని ఆరోపించారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి రాష్ట్రంలోని సీఎంలకు అత్యంత ప్రీతిపాత్రుడైన వెంకట్రామిరెడ్డిని ఉమ్మడి మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా సీఎం కేసీఆర్‌ నియమించారని, సీఎంలకు వేల కోట్ల రూపాయలు సంపాదించి పెట్టడం వంటి నైపుణ్యాలు వెంకట్రామిరెడ్డిలో ఉన్నాయని ఆరోపించారు. వెంకట్రామిరెడ్డిని ఆఘమేఘాల మీద ఎమ్మెల్సీ చేస్తున్నారు. ఏడేళ్లు వ్యాపారాలు చేసి వెనక్కి వచ్చిన సోమేష్‌కుమార్‌కు సీఎస్‌ పదవి ఇచ్చారు. అక్రమార్కులను అడ్డం పెట్టుకొని కేసీఆర్‌ అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. వెంకట్‌ రాంరెడ్డి నామినేషన్‌పై ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశామని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి తెలిపారు. నామినేషన్‌ పాత్రలు దాఖలు చేసే సమయంలో ఫిర్యాదు దారులను లోపలికి అనుమతించాలన్నారు. ఎన్నికల నిర్వహణ అధికారులు, టీఆర్‌ఎస్‌ పార్టీ వెంకట్‌ రాం రెడ్డికి సహకారం అందిస్తోందని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img