Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

అసదుద్దీన్‌పై కాల్పుల దృష్ట్యా అప్రమత్తమైన పోలీసులు

పాతబస్తీలో నిఘా కట్టుదిట్టం
ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వాహనంపై దుండగలు కాల్పులు జరపడం కలకలం రేపింది.ఈ ఘటన నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు.పాతబస్తీలో నిఘా కట్టుదిట్టం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా బలగాలను మొహరించారు. పాతబస్తీ, చార్మినార్‌,, మక్కా మసీద్‌ తదితర ప్రాంతాల్లో పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. క్విక్‌ రియాక్షన్‌ టీమ్‌, రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ను అందుబాటులో ఉంచారు. నైట్‌ పెట్రోలింగ్‌తో పాటు అదనంగా ఆర్మ్డ్‌ రిజర్వ్‌ పోలీసులు, ప్లాటూన్‌ దళాలు అక్కడికి చేరుకున్నాయి. ఇవాళ శుక్రవారం కావడం పోలీసులకు మరింత చాలెంజింగ్‌గా మారింది. చార్మినార్‌కు 4 దిక్కులు 4 పోలీస్‌స్టేషన్‌ల పరిధిలోకి వస్తుండటంతో అన్ని స్టేషన్‌ల పోలీసులు చార్మినార్‌ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. పాతబస్తీ పేరు చెబితే.. ముందు ఒవైసీ సోదరుల పేరు వినిపిస్తుంది. అసదుద్దీన్‌ ఓవైసీ కారుపై దాడితో ఓల్డ్‌ సిటీలో దాడులు జరిగే ప్రమాదం ఉందన్న అంచనాల నేపథ్యంలో బందోబస్తు పెంచారు. గతంలో అసదుద్దీన్‌ తమ్ముడు అక్బరుద్దీపైనా కాల్పులు జరిగాయి. హైదరాబాద్‌ కేంద్రంగా అక్బరుద్దీన్‌పై ఎటాక్‌ జరగగా.. ఈ ఘటన నుంచి త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. అసదుద్దీన్‌ టార్గెట్‌గా జరిగిన దాడిని రాజకీయ పార్టీలన్నీ ఖండిరచాయి. ఇదొక పిరికిపంద చర్యగా కేటీఆర్‌ అభివర్ణించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img