Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి


నిర్మల్‌ జిల్లా ఆసుపత్రిలో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…రెండో దశలో కొవిడ్‌ కేసులు అధికమయ్యాయని, శ్వాసకోస సమస్య, తీవ్ర అనారోగ్యంతో దవాఖానలో చేరిన వారికి ఆక్సిజన్‌ అందక చాలా మంది మృత్యువాత పడ్డారని చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండేందుకు కోటి రూపాయాల వ్యయంతో ఆక్సిజన్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ప్లాంట్‌ ద్వారా నిమిషానికి సుమారు 500 లీటర్ల ఆక్సిజన్‌ ఉత్పత్తి అవుతుందని చెప్పారు. జిల్లా దవాఖానాగా ఆప్‌ గ్రేడ్‌ అయిన నిర్మల్‌ ఏరియా హాస్పిటల్‌ అభివృద్ధి, అధునాతన వైద్య పరికరాలను సమకూర్చుకునేందుకు సీఎం కేసీఆర్‌ రూ. 48.83 కోట్లు మంజూరు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img