Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌లో తెలంగాణ నెంబర్‌వన్‌

గ్రామ పంచాయతీల ఆన్‌ లైన్‌ ఆడిటింగ్‌ లో తెలంగాణ దేశంలోనే నెంబర్‌ వన్‌ గా నిలిచింది గత ఏడాది కూడా తెలంగాణ ఆన్‌ లైన్‌ ఆడిటింగ్‌ లో నెంబర్‌ వన్‌ గా నిలవడం విశేషం. అదే ఒరవడిని కొనసాగిస్తూ ఈసారి కూడా తెలంగాణ నెంబర్‌ వన్‌గా నిలిచింది. ఈ మేరకు కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ, రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ను అభినందిస్తూ లేఖ రాసింది.కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ జాయింట్‌ సెక్రెటరీ సేథీ, ఇందుకు సంబంధించిన వివరాలను ఆ లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఆన్‌ లైన్‌ ఆడిటింగ్‌ లో తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు లీడ్‌ రోల్‌ పోషిస్తున్నట్లు ఆ లేఖలో అభినందించారు.కేంద్ర ఆర్థిక సంఘం ద్వారా స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్న నిధుల వినియోగంపై ఎప్పటికప్పుడు ఆడిటింగ్‌ నిర్వహిస్తున్నది. 2020-21 వ సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నిధులు వినియోగం విషయమై ఆన్లైన్‌ ఆడిటింగ్‌ నిర్వహిస్తూ అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ జారీ చేసింది. వాటికనుగుణంగా ఆయా రాష్ట్రాల్లోని స్థానిక సంస్థలు తాము చేసిన నిధుల ఖర్చును ఆన్‌ లైన్‌ లోనే అందిస్తున్నది. ఈ విధంగా నిర్ణీత గడువు కంటే ముందే వందకు వంద శాతం ఆన్లైన్‌ ఎడిటింగ్‌ పూర్తిచేసిన తెలంగాణ, దేశం లో నెంబర్‌ వన్‌ గా ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో 72 శాతం తో తమిళనాడు, 60 శాతం తో ఆంధ్ర ప్రదేశ్‌ దేశ్‌, 59% తో కర్ణాటక రాష్ట్రాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img