Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఇకపై బాయిల్డ్‌ రైస్‌ కొనం ..: కేంద్రం

పార్‌ బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. యాసంగి పంట ధాన్యం కూడా పరిమితంగానే కొంటామని స్పష్టంచేసింది. దేశ అవసరాలకు మించి వరి, గోధుమ సాగవుతోందని.. పంట మార్పిడి అనివార్యమని పేర్కొంది. ఈ మేరకు ధాన్యం సేకరణపై కేంద్ర ఆహార వినియోగదారుల వ్యవహారాల శాఖ వివరాలు వెల్లడిరచింది. ‘‘ఒక్కో రాష్ట్రం నుంచి డిమాండ్‌ ఒక్కో విధంగా ఉంది. డిమాండ్లకు అనుగుణంగా రాష్ట్రాలతో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. ఇప్పటి వరకు జరిగిన నిర్ణయాల ప్రకారం బాయిల్డ్‌ రైస్‌ కేంద్రం కొనదు. వరి, గోధుమ పంటను తక్కువ పండిరచాలని రాష్ట్రాలను కోరుతున్నాం. ప్రస్తుతం.. దేశంలో నిల్వలు సరిపడా ఉన్నాయి. అవకాశం ఉన్నంత మేరకు ఎగుమతి చేయడానికి ఉన్న అవకాశాలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లాలని సూచనలు చేస్తున్నాం. ఆయిల్‌, పప్పు ధాన్యాలు ఎక్కువ పండిరచాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు చేస్తున్నాం. రాష్ట్రాలు ఎంత వరకు సేకరించగలుగుతాయో అంత వరకే పరిమితం కావాలని చెబుతున్నాం.’’ అని ఓ ప్రకటనలో వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img