Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఇక రేవంత్‌ రెడ్డి ముఖం చూసేది లేదు : ఎంపీ కోమటిరెడ్డి

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ముఖం చూసేది లేదని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఆయన మండిపడ్డారు. తనను ఓడిరచాలని ప్రయత్నించిన వ్యక్తిని పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. సుధాకర్‌ను చేర్చుకునే విషయంలో రేవంత్‌ రెడ్డి పెద్ద తప్పు చేశారని అన్నారు. ఇకపై ఆయన ముఖం చేసేది లేదని స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాల తర్వాతే మునుగోడుకు వెళ్తానని చెప్పారు. తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ నేడు కాంగ్రెస్‌పార్టీలో చేరారు. ఈ నేపథ్యంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పైవిధంగా స్పందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img