Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఇదెక్కడి న్యాయం మోదీజీ? :మంత్రి హరీశ్‌రావు

రాష్ట్ర విభజన సక్రమంగా జరగలేదంటూ పార్లమెంట్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగంపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీకి పూర్తి మెజారిటీ లేకపోయినా, కాంగ్రెస్‌ తో పాటు అనేక ప్రతిపక్షాలు, బీజేపీ మిత్ర పక్షాలు కూడా వ్యతిరేకించినప్పటికీ, ప్రతి పక్షాలు డివిజన్‌ ఆడిగినప్పటికీ, మూజువాణి ఓటుతో వ్యవసాయ బిల్లులు పాస్‌ అయినట్టు రాజ్యసభలో ప్రకటించుకోవడం సక్రమమా? ఇదెక్కడి రాజ్యాంగ విధానమని హరీశ్‌రావు ప్రశ్నించారు. పాలక, ప్రతిపక్షాలతో పాటు 33 పార్టీలు సమర్ధించిన ఏపీ పునర్వ్యవస్థీకరణ బిల్లు అక్రమమా..? 4 కోట్ల తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను అపహాస్యం చేయడం ఏం పద్దతి మోదీ జీ? అని ప్రశ్నించారు. రైతు వర్గమంతా తీవ్రంగా వ్యతిరేకించినా వ్యవసాయ బిల్లులు తేవడం న్యాయమా..? అని అడిగారు. ప్రాణాలకు తెగించి సీఎం కేసీఆర్‌ చేసిన పోరాటం,వందలాది ఉద్యమకారుల ప్రాణత్యాగం ఫలితంగా. తెలంగాణ ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్ర బిల్లు ఆమోదం పొందడం అన్యాయమా.. ఇదెక్కడి న్యాయం మోదీ జీ..‘’ అని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img