Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఇ హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రాజెక్టును ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఇహెల్త్‌ ప్రొఫైల్‌ను పైలెట్‌ ప్రాజెక్టును మూలుగు జిల్లా కలెక్టరేట్‌లో లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోనే తొలిసారిగా ప్రజల ఆరోగ్య వివరాలను నమోదు చేస్తున్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిరిసిల్ల, మూలుగులో 40 రోజుల్లో ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించి హెల్త్‌ ప్రొఫైల్‌ను రూపొందించనున్నట్లు వెల్లడిరచారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి హరీశ్‌ రావు ప్రాజెక్టును ప్రారంభించారు. అంతకుముందు జిల్లా దవాఖాన భవనం, రేడియాలజీ ల్యాబ్‌, పీడియాట్రిక్‌ యూనిట్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హెల్త్‌ ప్రొఫైల్‌ సిద్ధం చేయడంలో భాగంగా వైద్యసిబ్బంది ఇంటింటికీ వెళ్లి, ప్రతి వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని సేకరించనున్నారు. ప్రతి వ్యక్తికి ప్రత్యేకంగా ఒక ఐడీ నంబర్‌ ఇస్తారు. వారి నుంచి నమూనాలను సేకరించి, 30 రకాల డయాగ్నోస్టిక్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఫలితాల ఆధారంగా వారి ఆరోగ్య సమస్యలను నిర్ధారిస్తారు. ఒకవేళ ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే చికిత్స ప్రారంభిస్తారు. వివరాలన్నింటినీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ చేస్తారు. ఈ సమాచారంతో అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి. దీర్ఘకాలిక బాధితులను గుర్తించడం, వారికి మెరుగైన వైద్యం అదించడం, క్యాన్సర్‌ వంటి రోగాలను ప్రాథమిక దశలోనే గుర్తించడం, రక్తహీనత వంటి సమస్యలను గుర్తించి తగిన చికిత్స అందించడం.. ఇలా అనేక ప్రయోజనాలు కలుగనున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img