Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఈటలది ఆత్మగౌరవం కాదు ఆత్మవంచన

బండి సంజయ్‌ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలి : మంత్రి కేటీఆర్‌

విశాలాంధ్ర – హైదరాబాద్‌ : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఆత్మ పంచన చేసుకుని ఇతర పార్టీలోకి వెళ్లారని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మంత్రి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈటల తనతో పాటు ప్రజలను కూడా మోసం చేస్తున్నారని అన్నారు. ఈటెలకు టిఆర్‌ఎస్‌ పార్టీ ఎంత గౌరవం ఇచ్చిందో ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. ఆయనకు టిఆర్‌ఎస్‌ పార్టీలో జరిగిన అన్యాయం ఏమిటో చెప్పాలని నిలదీశారు. మంత్రిగా ఉండి క్యాబినెట్‌ నిర్ణయాలను తప్పుబట్టారు, ఈటెల చేసిన తప్పును తనే ఒప్పుకున్నారని వివరించారు. ఈటల పై అమాయకుడు లేఖ రాస్తే ముఖ్యమంత్రి చర్యలు తీసుకోలేదు అని తెలిపారు. ఐదేళ్ల క్రితం ఆయన ఆత్మ గౌరవం దెబ్బ తింటే మంత్రిగా ఎందుకు కొనసాగారు? ఐదేళ్ల నుంచి ఈటెల అడ్డంగా మాట్లాడిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన్ను మంత్రిగా ఉంచారు. ఈటల టిఆర్‌ఎస్‌లో కొనసాగేలా చివరి వరకు ప్రయత్నించానని పేర్కొన్నారు. రాజేందర్‌ టిఆర్‌ఎస్‌ పార్టీలోకి రాక ముందు కూడా కమలాపూర్‌లో టిఆర్‌ఎస్‌ పార్టీ బలంగానే ఉందని స్పష్టం చేశారు. ఎన్నికైన పార్టీల మధ్యనే తప్ప ఎన్నికైన పార్టీల మధ్య వ్యక్తుల మధ్య కాదు అని మంత్రి అన్నారు. హుజురాబాద్‌ లో టిఆర్‌ఎస్‌, బిజెపి, కాంగ్రెస్‌ మధ్యనే పోటీ ఉంటుంది అని స్పష్టం చేశారు. ముందు బండి సంజయ్‌ పాదయాత్ర చేస్తున్నారో చెప్పాలని, ప్రజలకు అన్యాయం చేశామని పాదయాత్ర చేస్తున్నారా అని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణకు ఏం ఇచ్చింది, జల జీవన్‌ మిషన్‌ కింద అన్ని రాష్ట్రాలకు నిధులు ఇస్తుందని మరి తెలంగాణకు మాత్రం కేంద్రం నిధులు ఇవ్వడం లేదు అని మండిపడ్డారు. అంతకు ముందు ఆయన టిఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు పార్టీ నిర్మాణంపై చర్చిస్తున్నారు వీటితో పాటు పార్టీ సభ్యత్వ నమోదు డిజిటలైజేషన్‌ ప్రక్రియ. కార్యకర్తల జీవిత బీమా వంటి అంశాలపై చర్చించనున్నారు. పార్టీ జిల్లా కార్యాలయ ల నిర్మాణ పురోగతి ఇతర అంశాలపైనా ఈ భేటీలో చర్చించనున్నారు. చిత్రంలో తెలంగాణ రాష్ట్ర మంత్రులు తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, తెలంగాణ రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, చెన్నూరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, నాగర్‌ కర్నూల్‌ పార్లమెంట్‌ సభ్యులు పోతుగంటి రాములు, వివిధ నియోజకవర్గాల శాసనసభ్యులు జిల్లాలో ప్రధాన కార్యదర్శులు తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img