Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఈ ఏడాది నుంచి ఖ‌మ్మం మెడిక‌ల్ క‌ళాశాల త‌ర‌గ‌తులు

ఖమ్మం జిల్లాకు మెడికల్ కళాశాల ఏర్పాటుతో జిల్లా ప్రజల కల సాకారం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ విద్యా సంవత్సరం 2023-24 నుండే ప్రభుత్వ మెడికల్ కళాశాల తరగతులను నిర్వహించేందుకు 100 సీట్లతో నేషనల్ మెడికల్ కమిషన్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ ను విడుదల చేసింది. దీనికి అంగీకారం తెలుపుతు వారం రోజుల లోపల పూర్తిస్థాయిలో అన్ని అనుమతులతో ఖమ్మం మెడికల్ కళాశాల ప్రారంభం కానుంది. ఈ విద్యా సంవత్సరం నుండే తరగతులు ప్రారంభం కానున్న సందర్భంగా వైద్య విద్యార్థులకు, ప్రజలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే ఖమ్మం పాత కలెక్టరేట్ భవనంలో కొత్త మెడికల్ కళాశాల ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన మార్పులు, చేర్పులు జరుగుతున్న విషయం తెలిసిందే. కొత్తగా నిర్మాణాలతో పాటు మెడికల్ కళాశాలకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ సారధ్యంలో జరుగుతున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img