Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఈ నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కావాలి

మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి
:ఈ నెలాఖరు లోగా యాసంగికి సంబంధించి ధాన్య కొనుగోళ్ల ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు.బుధవారం స్థానిక అంబేద్కర్‌ భవన్‌ లో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి మంత్రి హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ యాసంగిలో లక్షా 30 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని 10 బాయిల్డ్‌, 33 రా రైస్‌ మిల్లులు మొత్తం 43 రైస్‌ మిల్లులు ఉన్నాయని పేర్కొన్నారు. 185 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అందులో 86 కేంద్రాలను ప్రారంభించి ఇప్పటివరకు 7 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరాలను వెల్లడిరచారు. వర్షాలు పడే సూచనలు ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండి ధాన్యం తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకొని వీలైనంత త్వరగా కొనుగోలును పూర్తి చేయాలని ఆదేశించారు. రైతులకు వారంలోగా పేమెంట్‌ జరిగేలా చూడాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img