Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లీషు మీడియం

కోఠిలోని మెహబూబియా స్కూల్‌ను సందర్శించిన మంత్రి సబిత
మన ఊరు మన బడి కింద రాష్ట్రంలోని అన్ని సర్కార్‌ స్కూళ్లను కార్పొరేట్‌కు దీటుగా అభివృద్ధి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రూ.9 వేల కోట్లు ఖర్చు చేసి 26 వేల స్కూళ్లలో సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆమె వివరించారు. వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు పునఃప్రారంభమైన నేపథ్యంలో ఉదయం హైదరాబాద్‌ కోఠిలోని మెహబూబియా స్కూల్‌కు వచ్చిన మంత్రి.. విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చి వెల్‌కమ్‌ చెప్పారు.స్కూళ్లకు ఇవ్వాళ తొలి రోజు పిల్లలు ఉత్సాహంగా వచ్చారని సబిత అన్నారు. సర్కార్‌ స్కూళ్లలో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిషు మీడియం మొదలు పెట్టామని తెలిపారు. ప్రైవేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని వెల్లడిరచారు. గవర్నమెంట్‌ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టిన సీఎంకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. గురుకుల పాఠశాలల్లో 4 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, గురుకులాలల్లో సీటు కోసం ప్రజాప్రతినిధులపై ఒత్తిళ్లు పెరుగుతున్నాయన్నారు. బడిబాట కార్యక్రమనికి మంచి స్పందన లభించిందని. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. లోపాలు వెతకకుండా ప్రభుత్వం చేస్తున్న పనులకు సహకరించాలని కోరారు. ప్రతిసారి మాదిరిగా ఈ విద్యా సంవత్సరంలో జులై మొదటి వారం లోపు పుస్తకాలు, రెండో వారంలో యూనిఫారమ్‌లు అందిస్తామని మంత్రి వివరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img