Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఉగాది తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం : మంత్రి నిరంజన్‌ రెడ్డి

కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ నూకలు తినాలన్న వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం ఎగుమతులను పెంచుకునే ప్రయత్నాలను కేంద్రం చేయడం లేదని ఆక్షేపించారు. తెలంగాణ భవన్‌లో మంత్రులు ప్రశాంత్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, పువ్వాడ అజయ్‌ కుమార్‌తో కలిసి మంత్రి నిరంజన్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉగాది తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, కేసీఆరే రైతులకు రక్షణ కవచం అని మంత్రి నిరంజన్‌ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల ఉసురుపోసుకున్న సర్కార్లు నిలవలేకపోయానని తెలిపారు. కేసీఆర్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ ఉన్నంత వరకు తెలంగాణ రైతులు భయపడాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. తెలంగాణను అవమానించిన, అవహేళన చేసిన ఎందరో రాజకీయ భవిష్యత్‌ లేకుండా పోయారు. చరిత్రపుటల్లో కప్పివేయబడ్డారని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి సహకారం లేదన్నారు. దశాబ్దాల పెండిరగ్‌ ప్రాజెక్టులను దశలవారీగా పూర్తి చేశామని తెలిపారు. గోదావరి, కృష్ణా జలాలతో రైతుల కాళ్లు కడుగుతున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ వ్యవసాయ రంగాన్ని గుర్తించి, ఈ రంగం మీద దృష్టి సారించారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img