Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఉచిత విద్యుత్‌ పథకం..ఓ వరం

మంత్రి హరీశ్‌ రావు
నాయీ బ్రాహ్మణులు, రజకులకు ఉచిత విద్యుత్‌ పథకంపై జిల్లా కలెక్టర్‌, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి హరీశ్‌ రావు మంగళవారం సమీక్షించారు. ఈ పథకం దరఖాస్తుదారుల వివరాలను జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సరోజ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సెలూన్లకు ఉచిత విద్యుత్‌ కోసం నాయీ బ్రాహ్మణులు 547 దరఖాస్తులు, దోబీ ఘాట్‌, లాండ్రీలకు ఉచిత విద్యుత్‌ కోసం రజకులు 280 దరఖాస్తులు ఇప్పటివరకు సమర్పించినట్లు మంత్రికి వివరించారు. వచ్చిన దరఖాస్తుదారుల వివరాలు పేర్కొంటూ జిల్లా కలెక్టర్‌ ద్వారా ఎలక్ట్రిసిటీ ఎస్‌ఈకి లేఖ రాయాలని మంత్రి ఆదేశించారు. ఈ సందర్శంగా మంత్రి మాట్లాడుతూ..నాయీ బ్రాహ్మణులు, రజకులకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రజకుల లాండ్రీ షాపులు, దోబీ ఘాట్‌లు, నాయీబ్రాహ్మణుల సెలూన్లకు ఉచిత విద్యుత్‌ను అందించే పథకం వరం లాంటిదని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img