Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉప్పల్‌ ఎమ్మెల్యే సుభాష్‌ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్‌ పరిధిలో ఉప్పల్‌ ఎమ్మెల్యే భేతి సుభాష్‌ రెడ్డికి తృటిలో ప్రమాదం తప్పింది. ఉప్పల్‌ నల్ల చెరువు ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వార్షికోత్సవానికి ఎమ్మెల్యే సుభాష్‌ రెడ్డితో పాటు బోడుప్పల్‌ మేయర్‌ బుచ్చిరెడ్డి, పలువురు హాజరయ్యారు. ఈ క్రమంలో ప్రైవేటు ఆసుపత్రిలోని లిఫ్టు ద్వారా పైకి వెళుతుండగా.. ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో బోడుప్పల్‌ మేయర్‌ బుచ్చిరెడ్డి, మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు.వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే సుభాష్‌ రెడ్డి సెక్యూరిటీ.. సిబ్బందిని పిలిచి లిఫ్టు తలుపులను తెరిపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img