Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఎనిమిదేండ్లలో అద్భుత ప్రగతి : మంత్రి కేటీఆర్‌

ఏనిమిదేండ్లలో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పారు. 2014లో తెలంగాణ జీఎస్‌డీపీ రూ.5.6 లక్షల కోట్లుగా ఉండేదని, 2022 నాటికి అది రూ.11.55 లక్షల కోట్లకు చేరిందన్నారు. ప్రధానితో జరిగిన సమావేశంలో ఇదేవిషయం చెప్పానని అన్నారు. హైదరాబాద్‌ రాయదుర్గం నాలెడ్జ్‌ సిటీలో ఉన్న టీ-హబ్‌లో జరిగిన డిప్లొమాటిక్‌ ఔట్‌రిచ్‌ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ‘త్రీఐ’ మంత్రతో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలో యంగెస్ట్‌ రాష్ట్రమైన తెలంగాణ.. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నదని చెప్పారు. తెలంగాణ అన్నిరంగాల్లో ముందంజలో ఉందన్నారు. 15 వందలకుపైగా మల్టీనేషన్‌ కంపెనీలు హైదరాబాద్‌లో కొలువుదీరాయని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. గూగుల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా లాంటి కంపెనీలు అమెరికా తర్వాత తమ సెకండ్‌ బ్రాంచిని హైదరాబాద్‌లో ప్రారంభించాయని వెల్లడిరచారు. ప్రపంచంలో భారత్‌ నంబర్‌ వన్‌లో ఉండాలంటే ఇన్నేవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూజివ్‌నెస్‌ అనే మూడు సూత్రాలు పాటించాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img