Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఎనిమిదేళ్లుగా విమోచన-విలీన దినోత్సవాలు గుర్తురాలేదా?

న్నికలు దగ్గరపడుతున్నాయనగానే రెడీ అయ్యారు
బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలకు సిగ్గుండాలి: వైఎస్‌ షర్మిల

విమోచన, సమైక్యత దినోత్సవాలతో తెలంగాణ రాష్ట్రం హోరెత్తుతున్న వేళ బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలపై వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. ఎనిమిదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గుర్తురాని విమోచన-విలీన దినోత్సవాలు ఇప్పుడు గుర్తుకు వచ్చాయా అంటూ కడిగేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి అనగానే.. సెప్టెంబర్‌ 17 రచ్చను ముందరేసుకొని పోటాపోటీ ఉత్సవాలకు రెడీ అయ్యారంటూ విమర్శించారు.కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్‌ఎస్‌ పార్టీలు ప్రజా సమస్యలను మరిచి పబ్లిసిటీ స్టంట్‌లో మునిగిపోయాయంటూ షర్మిల ఘాటుగా విమర్శించారు. హామీలను మరిచి.. ఉత్సవాల పేరిట జనాన్ని తరలించడానికి బస్సులు, పబ్లిసిటీ చేసుకోవడానికి మెట్రో పిల్లర్ల కోసం-హోర్డింగ్‌ బోర్డుల కోసం పోటీ పడుతున్నారని విమర్శించారు. అధికారం కోసం లేని సమస్యను సృష్టించి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూడటానికి బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలకు సిగ్గుండాలంటూ షర్మిల ఉతికారేశారు.మరోవైపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విమోచన దినోత్సవాలు, జాతీయ సమైక్యత వజ్రోత్సవాలతో బీజేపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు వేర్వేరుగా వేడుకలు నిర్వహిస్తోంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో జాతీయ జెండా ఆవిష్కరించి తెలంగాణ విమోచన దినోత్సవాలను ప్రారంభించగా.. పబ్లిక్‌ గ్రౌండ్స్‌లో సీఎం కేసీఆర్‌ తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో జాతీయ జెండా ఎగురవేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img