Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఎమ్మెల్యేగా భగత్‌ ప్రమాణ స్వీకారం

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన నోముల భగత్‌ శాసన సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్‌ చాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అసెంబ్లీ రూల్స్‌ బుక్స్‌, ఐడెంటిటీ కార్డును భగత్‌ కు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, ఎమ్మెల్యేలు గ్యాదరి కిషోర్‌, భాస్కర్‌ రావు, ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి నరసింహ చార్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img