Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఎలాంటి టెస్టులకైనా నేను రెడీ.. రాహుల్‌ రెడీనా..?

రేవంత్‌రెడ్డి విసిరిన వైట్‌ చాలెంజ్‌పై కేటీఆర్‌ కౌంటర్‌
టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మధ్య ట్వీట్టర్‌ వార్‌ కొనసాగుతూనే ఉంది. డ్రగ్స్‌ బెడదపై యువతలో అవగాహన కల్పించడానికి తాను ప్రారంభించిన వైట్‌ ఛాలెంజ్‌ను సిద్ధమా అంటూ రేవంత్‌ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. .తాను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధంగా ఉన్నానని, కాంగ్రెస్‌ తరపున రాహుల్‌గాంధీ సిద్ధమేనా ? రాహుల్‌ ఒప్పుకుంటే ఢల్లీి ఎయిమ్స్‌కు వెళ్తానని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. చర్లపల్లి జైలుకు వెళ్లొచ్చిన వారితో టెస్టులు చేయించుకునే స్థాయి తనది కాదు అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఒక వేళ తాను టెస్టులు చేయించుకుని, క్లీన్‌చీట్‌తో వస్తే రేవంత్‌ రెడ్డి తనకు క్షమాపణలు చెప్పి, పదవులు వదులుకుంటారా? అని కేటీఆర్‌ సూటిగా అడిగారు. ఓటుకు నోటు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షలకు సిద్ధమా? అని ట్విట్టర్‌ వేదికగా సవాల్‌ విసిరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img