Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

ఏప్రిల్ 8న మోదీ హైదరాబాద్ రాక… తిరుపతి వందేభారత్ రైలుకు ప్రారంభోత్సవం

ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 8న హైదరాబాద్ పర్యటనకు రానున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మధ్య ఓ వందేభారత్ రైలు నడుస్తున్న సంగతి తెలిసిందే.సికింద్రాబాద్-విశాఖ మధ్య ఈ రైలు నడుస్తోంది. ఇప్పుడు సికింద్రాబాద్-తిరుపతి మధ్య మరో వందేభారత్ రైలు వస్తోంది. కాగా, ఈ రైలు ఆగే స్టేషన్లు, సమయాలు, చార్జీల వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img