Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఐఏఎస్‌లకు కేస్‌స్టడీగా మారిన రాజన్న సిరిసిల్ల: మంత్రి కేటీఆర్‌

ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతంగా ఉన్న రాజన్న సిరిసిల్ల.. ఇప్పుడు ఐఏఎస్‌లకు కేస్‌ స్టడీగా మారిందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. చెరువులు బాగుచేసుకోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జిల్లా పరిస్థితి సుభిక్షితంగా మారిందన్నారు. జిల్లాలో భూగర్భ నీటిమట్టం ఆరు మీటర్లు పెరిగిందని చెప్పారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను మంత్రులు కేటీఆర్‌, సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. నీళ్లు నిధులు, నియామకాలే ట్యాగ్‌లైన్‌గా ఏర్పడిన రాష్ట్రాన్ని.. ఎనిమిదేండ్లుగా ఎంతో అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత విద్యారంగంలో భారీ మార్పులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో 972 గురుకులాలు ఉన్నాయని, 5 లక్షల మంది విద్యారులు ఉన్నారని చెప్పారు. గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై రూ.లక్షకుపైగా ఖర్చు చేస్తున్నామని వెల్లడిరచారు. స్టడీ మెటీరియల్‌ యాప్‌ ద్వారా విద్యార్థులకు అందించాలన్నారు. ఈ ఎనిమిదేండ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క విద్యా సంస్థను ఇవ్వలేదని విమర్శించారు.ఆయన మతాల పేరిట జరుగుతున్న గొడవలపై స్పందించారు. మతాల పేరు చెప్పుకుని కొట్టుకోమని ఏ దేవుడు చెప్పాడంటూ ఆయన ప్రశ్నించారు. నీళ్లు లేక కొందరు, తిండి లేక చాలా మంది అల్లాడుతుంటే…వాటి పరిష్కారం వదిలేసి అనవసర విషయాలపై రాద్ధాంతం చేయడం అవసరమా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. 8 ఏళ్ల పాలనలో తెలంగాణలో ఏం సాధించారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయన్న కేటీఆర్‌… ఈ 8 ఏళ్ల స్వల్ప కాలంలోనే నీటిపారుదల రంగంలో తెలంగాణ దేశానికే ఓ నమూనాగా మారిందని చెప్పారు. ఈ రంగంలో రాష్ట్రం ఉజ్వల స్థితికి చేరిందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నీటి పారుదల రంగంలో ఐఏఎస్‌లకే పాఠాలు చెప్పే స్థాయికి ఎదగమే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. కేసీఆర్‌ హయాంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి సాధించిందన్నకేటీఆర్‌… దేశంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగ నియామకాలు జరిపిన రాష్ట్రంగా తెలంగాణ రికార్డులకెక్కిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img