Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఐటీ రంగంలో గణనీయమైన వృద్ధి

ఐటీ రంగంలో గణనీయమైన వృద్ధి

హైదరాబాద్‌ :
రాష్ట్రంలో ఐటీ రంగం గణనీయమైన అభివృద్ధి సాధిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నాస్కామ్‌ 12 ఎడిషన్‌ జీసీసీ కాంక్లేవ్‌ ప్రారంభ కార్యక్రమంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులతో పాటు కేటీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ప్రపంచ దిగ్గజ సంస్థల కార్యాలయాలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేశాయని తెలిపారు. హైదరాబాద్‌లో ఐటీ వృద్ధి రేటు గణనీయంగా పెరుగుతుందని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్‌ సెంటర్‌ హైదరాబాద్‌లో ఉందన్నారు. గత ఏడాది ఐటీ విభాగంలో లక్షా 50 వేల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. నగరంలోని వసతులు, ఇతర సౌకర్యాల కారణంగా ప్రపంచ దేశాలు హైదరాబాద్‌ వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌ పాలనతో ఐటీ అభివృద్ధి పరుగులు పెడుతోందని పేర్కొన్నారు. ఐదేళ్లలో 30కి పైగా ఫ్లై ఓవర్లు నిర్మించామని చెప్పారు. ఐటీతో పాటు ఇతర రంగాల అభివృద్ధిపైనా దృష్టి సారించినట్టు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img