డీహెచ్ శ్రీనివాసరావు
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పట్ల భయాందోళన చెందొద్దని, దీనివల్ల ప్రాణాపాయం లేదని వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటివరకు ఒమిక్రాన్ సామూహిక వ్యాప్తిలేదని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసులు తొమ్మిదికి చేరాయని వెల్లడిరచారు. హనుమకొండకు చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయిందన్నారు. ఈ కొత్త వేరియంట్ బాధితుల్లో 95 శాతం మందిలో లక్షణాలు కనిపించట్లేదని తెలిపారు. నాన్‌రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఏడుగురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని చెప్పారు. కరోనా థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, లాక్డౌన్ పెడతారన్న దుష్ప్రచారాలను నమ్మవద్దన్నారు. దేశంలోని ఒమిక్రాన్ బాధితుల్లో ఒకరిద్దరే ఆసుపత్రుల్లో చేరారని వెల్లడిరచారు. మొత్తం 90 దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి ఉందని వెల్లడిరచారు. ఈ వేరియంట్ వల్ల ప్రపంచంలో ఒక్క మరణం మాత్రమే నమోదయిందన్నారు. భవిష్యత్‌లో మరో 10 కొత్త వేరియంట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు.ఒమిక్రాన్‌పై అనవసర భయాందోళన అవసరం లేదని సూచించారు. వ్యాక్సిన్ తీసుకోకపోవడం కూడా ఒమిక్రాన్ వ్యాప్తికి కారణమన్నారు. కొత్త వేరియంట్‌ను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఇంటా బయటా మాస్కు ధరించాలన్నారు. ప్రజలంతా బాధ్యతగా కరోనా నిబంధనలు పాటించాలని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 97 శాతం మంది మొదటి డోసు తీసుకున్నారని చెప్పారు. 11 జిల్లాల్లో వందశాతం మొదటి డోసు తీసుకున్నారని వెల్లడిరచారు. 56 శాతం మంది రెండు డోసులు వేసుకున్నారని తెలిపారు.