Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

ఒమిక్రాన్‌ కేసులు దాస్తున్నామన్న వార్తల్లో వాస్తవం లేదు

: డీహెచ్‌ శ్రీనివాసరావు

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు దాస్తున్నామన్న వార్తల్లో వాస్తవం లేదని తెలంగాణ ప్రజారోగ్య సంచాలకులు (డీహెచ్‌) డా.శ్రీనివాసరావు తెలిపారు. కొవిడ్‌ను ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కొంటోందని చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారికి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో పరీక్షలు చేస్తున్నాం. 900 మందికి పైగా ఇప్పటివరకు విదేశాల నుంచి రాష్ట్రానికి చేరుకోగా అందులో 13 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయ్యిందని తెలిపారు. వారికి ఒమిక్రాన్‌ సోకిందా..లేదా అనే విషయం ఒకట్రెండు రోజుల్లో తేలుతుందన్నారు. వైరస్‌ నియంత్రణలో ప్రజల భాగస్వామ్యం ముఖ్యమని చెప్పారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మనల్ని మనం కాపాడుకోవచ్చు అని చెప్పారు. ముడో వేవ్‌ను ఎదుర్కోవడానికి ప్రభుత్వం సన్నద్ధంగా ఉందన్నారు. ప్రజలు భయపడాల్సిన పనిలేదు. అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఒమిక్రాన్‌ సోకిన వారిలో తీవ్ర లక్షణాలు కనిపించడం లేదని తెలిపారు. వైరస్‌ సోకితే తీవ్ర ఒళ్లు నొప్పులు, తలనొప్పి, నీరసం ఉంటాయని తెలిపారు. కొవిద్‌ కంటే తప్పుడు వార్తలు ప్రమాదకరం. తప్పుడు వార్తలతో ప్రజల్లో ఆందోళన పెంచుతున్నారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img