Friday, April 26, 2024
Friday, April 26, 2024

కరోనా థర్డ్‌వేవ్‌ వచ్చినా..అంత తీవ్రంగా ఉండకపోవచ్చు…

కరోనా థర్డ్‌వేవ్‌ వచ్చినా..సెకండ్‌ వేవ్‌ అంత తీవ్రంగా ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. నవంబర్‌ 12-14 మధ్య జరుగనున్న పబ్లిక్‌ హెల్త్‌ ఇన్నోవేషన్స్‌ కాంక్లేవ్‌ -పీహెచ్‌ఐసీ ఎక్స్‌పో 2021కు సన్నాహకంగా ‘భారతదేశం మరియు ప్రపంచంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌’ అనే అంశంపై ఓ చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ చర్చా కార్యక్రమానికి సంధానకర్తగా ఇన్‌ఫెక్షన్‌ కంట్రోల్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు డాక్టర్‌ రంగారెడ్డి బుర్రి వ్యవహరించారు. కరోనా థర్డ్‌వేవ్‌..సెకండ్‌ వేవ్‌ అంత తీవ్రంగా మాత్రం అది ఉండకపోవచ్చని, రోజువారీ కేసులు 1,40,000కు మించి ఉండకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. దీనికి ప్రధాన కారణం దేశం లో దాదాపు 40్న మందికి పైగా టీకాలు పూర్తికావడమే అని నిపుణులు అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ సీఈఓ (ఏపీఐ అండ్‌ సర్వీసెస్‌) దీపక్‌ సప్రాబీ ఐఐటీ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌, సెర్బ్‌ నేషనల్‌ సైన్స్‌ చైర్‌, ఫెలో-రాయల్‌ సొసైటీ డాక్టర్‌ ఎం విద్యాసాగర్‌, ఇండియన్‌ ఇని స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌-హైదరాబాద్‌ డైరెక్టర్‌ జీవీఎస్‌ మూర్తి, మెడికవర్‌లో సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌గా చేస్తోన్న డాక్టర్‌ ఎం ఎస్‌ ఎస్‌ ముఖర్జీ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img