Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కార్పొరేట్‌ కనుసన్నల్లో మోదీ

సీపీఐ కార్యదర్శి నారాయణ

విశాలాంధ్ర – మల్కాజిగిరి : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్‌ కనుసన్నల్లో పని చేస్తూ పాలనను దిగజారుస్తూ ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టరు కె.నారాయణ ఆందోళన వ్యక్తంచేశారు. సీపీఐ ఆధ్వర్యంలో ఇంటింటికి సీపీఐ పాదయాత్రలో భాగంగా గురువారం ఆనందబాగ్‌ చౌరస్తాలో జరిగిన సభలో నారాయణ మాట్లాడుతూ రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమత్వ విధ్వం సానికి మోదీ ప్రభుత్వం పాల్పడు తోందని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ఉన్న ఐదు ప్రభుత్వరంగ సంస్థలనునా తరువాత 400కు విస్తరించుకొని స్వావలంబన దిశగా అడుగులు వేస్తే మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తున్నారన్నారు. దేశంలో లాభాలతో నడిచే బ్యాంకులు, బీమా కంపెనీలు, ఉక్కు, బొగ్గు, రైల్వే, విమానయానం, చమురు కంపెనీలు, నౌకాశ్రయం, ఆఖరుకు రక్షణ రంగంతో పాటు అన్ని రంగా లను ప్రైవేటికరించేలా చట్టాలు చేశారని విమర్శించారు, ప్రమాదకర పాసిస్టు విధానాలను, నిరంకుశ హిట్లర్‌ తరహా పాలనను అందిస్తున్న నరేంద్ర మోదీ ప్రభు త్వాన్ని 2024 ఎన్నికల్లో ఓడిరచి వామపక్ష, ప్రగతిశీల, లౌకిక ప్రజాస్వామిక శక్తులతో కూడిన ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడానికి కమ్యూనిస్టు పార్టీ కృషి చేస్తుందని నారాయణ తెలిపారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎన్‌.బాలమల్లేశ్‌ ప్రసంగిస్తూ టీఆర్‌ఎస్‌ ప్రభుతం ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను అమలు పర్చడం లేదన్నారు. పేదలు ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుంటే రెవెన్యూ, పోలీసు అధికారులు హుటాహుటిన తొలగిస్తున్నారని విమర్శించారు. ఈ సభలో సీపీఐ మేడ్చల్‌ జిల్లా కార్యదర్శి డీజీ సాయిలు గౌడ్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు సి.హెచ్‌ దశరథ్‌, రొయ్యల కృష్ణమూర్తి, రచ్చ కిషన్‌, మల్కాజ్గిరి మండల కార్యదర్శి టి.యాదయ్య గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img