Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

కేంద్రం కక్షపూరిత విధానాన్ని మానుకోవాలి

మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి
తెలంగాణపై కేంద్రం కక్షపూరిత విధానాన్ని మానుకోవాలని మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ, దేశంలోని రైతులందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందన్నారు.శాసన మండలి చైర్మన్‌గా తనను రెండోసారి ఎన్నుకున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ధాన్యం కొనుగోలుపై రాష్ట్రంలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు కేంద్రం మానుకోవాలని అన్నారు. పంజాబ్‌లో మాదిరిగానే తెలంగాణలోనూ మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. యాసంగి ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం మార్గం చూపించాలన్నారు. రా రైస్‌, బాయిల్డ్‌ రైస్‌ అనే తేడా లేకుండా వడ్లను కొనుగోలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్లను కొని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నదని, దాన్నీ ఏ రైస్‌ మార్చుకోవలన్నది కొన్న తర్వాత కేంద్రం నిర్ణయించుకోవచ్చని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img