Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కేంద్రం నదుల అనుసంధానాన్ని చేపడితే గాంధీమార్గంలో ఉద్యమిస్తాం

వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేందర్‌ సింగ్‌
నదుల అనుసంధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వాటర్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా రాజేందర్‌ సింగ్‌ అన్నారు. నగరంలోని జలసౌధలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేందర్‌ సింగ్‌ ప్రసంగించారు. నదుల అనుసంధానం దేశానికి విపత్తు అని పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రాల మధ్య తగాదాలు వస్తాయన్నారు. మిగులు జలాలు ఉన్నాయని ఏ రాష్ట్రం అంగీకరించలేదు అని ఆయన అన్నారు. అనుసంధానమంటే నీటిని ప్రైవేటు, వాణిజ్యపరం చేయడమే అని చెప్పారు. ఇది అవినీతికి ఆజ్యం పోస్తుందని మండిపడ్డారు. అనుసంధానించాల్సింది నదులను కాదు.. నదులతో మనషుల మేథస్సు, హృదయాన్ని అని పేర్కొన్నారు. కేంద్రం నదుల అనుసంధానాన్ని చేపడితే గాంధీజీ మార్గంలో ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img