Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కేంద్ర అసమర్థ పాలనా విధానాలపై నిరంతర పోరు సాగిస్తాం : మంత్రి కేటీఆర్‌

గడియకోసారి పెరుగుతున్న గ్యాస్‌ ధరలతో ప్రజలకు గుండె దడ వస్తోందని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అన్నారు. మోదీ పాలనలో వంట గదుల్లో మంటలు పుడుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచి దేశ ప్రజలపై దొంగ దాడి చేస్తోందని మండిపడ్డారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయలేని దౌర్భాగ్య పాలనలో దేశం ఉందన్నారు. గ్యాస్‌ ధర పెంపుపై నిరసన చేపట్టిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు కేటీఆర్‌ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర అసమర్థ పాలన విధానాలపై నిరంతర పోరు సాగిస్తామని కేటీఆర్‌ తేల్చిచెప్పారు. గ్యాస్‌ సిలిండర్‌ ధరల పెంపునకు వ్యతిరేకంగా ఇవాళ నిరసన ప్రదర్శనలు చేపట్టాలని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని మండల, పట్టణ కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. మహిళలు గ్యాస్‌ సిలిండర్లతో ప్రదర్శన చేపట్టారు. మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రధాని పదవి నుంచి మోదీ దిగిపోవాలని మహిళలు డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img