Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

కేంద్ర అస్పష్ట విధానంతో రైతుల్లో గందరగోళం

మంత్రి నిరంజన్‌రెడ్డి
కేంద్ర అస్పష్ట విధానంతో రైతులు గందరగోళానికి గురవుతున్నారని మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు తలా తోక లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేంద్రం తన ధర్మాన్ని నిర్వర్తించకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలు వేస్తున్నారన్నారు. షరతులు పెట్టి.. పోయిన యాసంగి ధాన్యం కొన్నారని తెలిపారు. గురువారం ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించిన టీఆర్‌ఎస్‌ మహాధర్నాలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ అద్భుతాలు సృష్టించిందని చెప్పారు.రాష్ట్రంలో పల్లెలన్నీ పచ్చబడ్డాయని, కేంద్ర అస్పష్ట విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. అన్ని వ్యవస్థలు కేంద్రం చేతుల్లోనే ఉన్నాయని, ఒప్పందం చేసుకున్న ధాన్యాన్ని కూడా కొనడం లేదని విమర్శించారు. కిషన్‌ రెడ్డికి ఎద్దులు లేవు.. సంజయ్‌కి బండి లేదు..సాగు గురించి బీజేపీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని చెప్పారు.బీజేపీ తొండి మాటలు బంద్‌ చేయాలని అన్నారు. వరి ధాన్యం కొంటారో లేదో కేంద్రం స్పష్టం చేయాలని…రాష్ట్రాన్ని బద్నాం చేయడం మంచి పద్ధతి కాదని అన్నారు.. కేంద్రం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేదంటే కేంద్రమే నష్టపోతుందని చెప్పారు. ఐకమత్యంగా ఉంటే అంతిమ విజయం రైతులదేనని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img