Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

కొనసాగుతున్న సింగరేణి సమ్మె

సింగరేణి కార్మికుల సమ్మె రెండో రోజుకు చేరింది. సింగరేణిలో 4 బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో మూడు రోజులపాటు సమ్మెకు జేఏసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.నాలుగు బొగ్గు బ్లాకుల వేలానికి వ్యతిరేకంగా అన్ని కార్మిక సంఘాలు సమ్మెకు మద్దతు ప్రకటించడంతో కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు.దీంతో నాలుగు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడిరది.40 కోట్ల రూపాయలు కార్మికుల వేతనాలకు నష్టం వాటిల్లింది. రెండో రోజైన శుక్రవారం సింగరేణి కార్మికులు భూపాల్‌పల్లి ఏరియాలో విధులకు హాజరు కాలేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img