Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని పార్టీ నుండి సస్పెండ్‌ చేయాలి : కొండా సురేఖ

కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ముఖ్యనేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పార్టీకి నష్టం చేసిన కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిని సస్పెండ్‌ చేయాలన్నారు. అందరం కలిసి పనిచేయలేకే ఓడిపోయామని, ఇప్పటికైనా అందరూ కలిసి పనిచేయాలని ఆమె కోరారు. కాంగ్రెస్‌లో నేతల మధ్య సమన్వయం లోపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా ఇన్‌చార్జితో చెప్పుకోవాలని రేవంత్‌ రెడ్డి అన్నారు. సమావేశ అజెండా మీదనే మాట్లాడాలి, వ్యక్తిగత అజెండా వద్దని రేవంత్‌ రెడ్డి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img