Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

క్లౌడ్‌ బరస్ట్‌తోపాటు నీటమునిగిన ఇళ్ళు..అవి చూడాలని కేటీఆర్‌కు వైఎస్‌ షర్మిల చురకలు

ఇటీవల తెలంగాణ ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు కాలికి గాయం కావడంతో డాక్టర్లు మూడు వారాలు విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారని కేటీఆర్‌ సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిరచిన విషయం తెలిసిందే. అంతేకాదు విశ్రాంతి తీసుకునే సమయంలో ఏవైనా ఓటీటీ కంటెంట్‌ చూడడానికి సలహా ఇవ్వమని మంత్రి కేటీఆర్‌ సోషల్‌ మీడియాలో కోరారు. దీంతో చాలామంది కేటీఆర్‌కు అనేక సినిమాలను, వెబ్‌ సిరీస్‌ను సూచిస్తున్నారు.ఈ నేపథ్యంలో తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్‌ షర్మిల మాత్రం కేటీఆర్‌కు సున్నితంగా చురకలు అంటించారు. కేటీఆర్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూనే మీ ఆనందం కోసం మీరు చూడాల్సిన సినిమాలు కుట్ర సిద్ధాంతం అని సెటైర్లు వేశారు. టీఆర్‌ఎస్‌ పేర్కొన్న క్లౌడ్‌ బరస్ట్‌, నీటమునిగిన ఇళ్ళు, మరియు పంప్‌ హౌస్‌లు అంటూ ఆసక్తికర ట్వీట్‌ చేశారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాలలో వరదల నేపథ్యంలో ప్రజల కష్టాలను నేరుగా తెలుసుకుంటున్న వైయస్‌ షర్మిల, వరదల బారినుండి ప్రజలను రక్షించడంలో ప్రభుత్వం వైఫల్యం చెంది, పోలవరం కుట్రలు, క్లౌడ్‌ బరస్ట్‌ కుట్రలు అంటూ టీఆర్‌ఎస్‌ నేతలు కట్టుకథలు చెబుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఇక ఈ క్రమంలోనే కేటీఆర్‌కు వాళ్లు చెప్పిన కుట్ర సిద్ధాంతం షోలే చూడాలంటూ సెటైర్లు వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img