Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఖమ్మంలో దారుణం..బైక్‌ లిఫ్ట్‌ అడిగి ఇంజెక్షన్‌ ఇచ్చి చంపేశాడు..!

ఖమ్మం జిల్లా ముదికొండ మండలం బాణాపురంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి బైక్‌ను ఆపి లిఫ్ట్‌ అడిగిన దుండగుడు..కొంతదూరం వెళ్లాక వాహనదారుడికి ఇంజెక్షన్‌ ఇచ్చాడు. సూది పొడిచిన వెంటనే వాహనదారుడు స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా ఆ వాహనదారుడు మార్గమధ్యంలో మృతిచెందారు. వివరాల్లోకి వెళితే చింతకాని మండలం బొప్పారానికి చెందిన షేక్‌ జమాల్‌ సాహెబ్‌ (40) వల్లభిలో కుమార్తె వద్ద ఉన్న భార్యను తీసుకొచ్చేందుకు ద్విచక్రవాహనంపై తన ఇంటి నుంచి బయలుదేరాడు. వల్లభి సమీపంలోకి రాగానే గుర్తు తెలియని వ్యక్తి జమాల్‌ను లిఫ్ట్‌ అడిగాడు. దీంతో జమాల్‌ అతడ్ని తన వాహనంపై ఎక్కించుకున్నాడు. కొంతదూరం వెళ్లగానే దుండగుడు తనకు ఇంజెక్షన్‌ ఇచ్చినట్లు గుర్తించడంతో వెంటనే వాహనాన్ని ఆపగానే నిందితుడు అక్కడ్నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని ఆయన తన భార్యకు ఫోన్‌లో తెలిపారు. అనంతరం స్పృహ కోల్పోవడంతో వాహనదారులు ఆసుపత్రికి తరలించారు. అయితే జమాల్‌ మార్గమధ్యలోనే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ముదికొడ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img