Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఖైరతాబాద్‌ గణేశ్‌ విగ్రహ నమూనా ఆవిష్కరణ

ఖైరతాబాద్‌ గణేశ్‌ విగ్రహ నమూనాను ఉత్సవ కమిటీ ఇవాళ ఆవిష్కరించింది. గతేడాది ధన్వంతరి మహాగణపతి రూపంలో కొలువుదీరిన మట్టి గణనాథుడు ఈసారి శ్రీ పంచముఖ రుద్ర మహాగణపతి రూపంలో 40 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకోనున్నాడు.మండపంలో గణనాథుడికి ఎడమ వైపు కాలనాగదేవత, కుడివైపు కాలవిష్ణు విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. ఇరువైపులా కృష్ణకాళి, కాళనాగేశ్వరిమూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడిరచింది.
సెప్టెంబర్‌ 10 నుంచి ప్రారంభమయ్యే గణేష్‌ నవరాత్రి ఉత్సవాల నాటికీ విగ్రహ రూపుదిద్దుకోనుంది. ఖైరతాబాద్‌ గణేశుని లక్షలాది మంది భక్తులు దర్శించుకుంటారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img