Wednesday, April 17, 2024
Wednesday, April 17, 2024

గిరిజన ఆశ్రమ పాఠశాలలను ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలుగా మార్పు

మంత్రి సత్యవతి రాథోడ్‌
తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖలో ఉన్న 1430 ప్రాథమిక పాఠశాలలు, 326 ఆశ్రమ పాఠశాలలను ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలుగా మారుస్తున్నట్లు గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ తెలిపారు. ఆయా పాఠశాలల్లో గిరిజనులకు ఆంగ్ల విద్య, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ అన్ని ఐటీడీఏల ప్రాజెక్టు ఆఫీసర్లు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించింది.ఈ సమావేశంలో మంత్రి సత్యవతిరాథోడ్‌ మాట్లాడుతూ టీచర్లందరికీ ఇంగ్లీష్‌ మీడియంలో బోధించడంలో తర్ఫీదునివ్వడం జరుగుతున్నదన్నారు.ఈ ఇంగ్లీష్‌ మీడియంలో చదివే అవకాశాన్ని గిరిజన పిల్లలకు కల్పిస్తున్నామన్నారు.తల్లిదండ్రులు అందరూ వినియోగించుకునేలా ‘బడిబాట’లో ప్రచారం చేయాలని అధికారులకు సూచించారు. పాఠశాలలు, హాస్టళ్ళకు ఏవైనా రిపైర్లుంటే వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img