Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

గ్రామీణ, పట్టణ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నాం

: మంత్రి కేటీఆర్‌

గ్రామీణ, పట్టణ ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. పల్లె, పట్టణ ప్రగతిపై శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా సభ్యులు మాట్లాడిన అనంతరం మంత్రి ప్రసంగించారు. పట్టణాల అభివృద్ధిలో భాగంగా నాలుగు కమిటీలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామని, దాదాపు 2 లక్షల మంది కమిటీల్లో ఉన్నారని చెప్పారు. ఇండ్ల నిర్మాణానికి సెల్ఫ్‌ ఎసెస్‌మెంట్‌ విధానం తీసుకొచ్చాం. 75 గజాల్లోపు ఇంటి నిర్మాణానికి అనుమతి అవసరం లేదని అన్నారు. సీఆర్‌ఎంపీ కింద రూ. 1800 కోట్లకు పైగా నిధులతో రోడ్లను నిర్మిస్తున్నాం. ఎస్‌ఆర్‌డీపీ కింద లింకు రోడ్లను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. చెరువుల సుందరీకరణకు ప్రత్యేక కమిషనర్‌ను నియమించాం. రూ. 37 కోట్లతో ట్యాంక్‌బండ్‌ను ఆధునీకరించాం. హుస్సేన్‌ సాగర్‌ వెంట నైట్‌ బజార్‌ ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img