Friday, April 19, 2024
Friday, April 19, 2024

గ్రామీణ ప్రాంతాల్లో 2,33,000 కొత్త విద్యుత్‌ స్తంభాలు ఏర్పాటుచేశాం

సీఎం కేసీఆర్‌
రాష్ట్రంలో సర్పంచ్‌ల కంటే సఫాయి కార్మికులకే ఎక్కువ జీతం ఇస్తున్నామని సీఎం కేసీఆర్‌ అన్నారు. గ్రామాలు, పట్టణాలను శుభ్రంగా ఉంచుతున్న కార్మికులకు దండం పెట్టాలని అన్నారు.. శాసనసభలో పల్లెప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ప్రసంగించారు.గ్రామపంచాయతీ సిబ్బందికి రూ. 8500ల చొప్పున ఇస్తున్నాం. మున్సిపాలిటీల్లో రూ. 12 వేలకు తగ్గకుండా జీతాలు ఇస్తున్నాం. జడ్పీటీసీలకు గతంలో రూ. 2250 ఇస్తే.. ఇప్పుడు రూ. 13 వేలు ఇస్తున్నాం. మండల ప్రజాపరితష్‌ సభ్యులకు గతంలో రూ. 1500 ఇస్తే.. ఇప్పుడు రూ. 13 వేలు ఇస్తున్నాం. సర్పంచ్‌లు, ఎంపీటీలకు రూ. 6500లకు పెంచాం. పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 2,33,000 కొత్త విద్యుత్‌ స్తంభాలను ఏర్పాటు చేశాం. 59 వేల కి.మీ. మేర విద్యుత్‌ వైర్లు ఏర్పాటు చేశాం. ఇంకా ఎక్కడైనా సమస్యలుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img