Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

చేతులెత్తి దండం పెడుతున్నా..కరోనా వ్యాక్సిన్‌ తీసుకోండి

నిజామాబాద్‌ కలెక్టర్‌ ఆడియో సందేశం
కరోనా కొత్త వేరియంట్‌తో థర్డ్‌ వేవ్‌ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఈ నేపథ్యంలో కేంద్రం సైతం.. అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. వైద్య సిబ్బంది సూచనలు చేస్తున్నారు. కరోనా కట్టడికి అందరూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలంటూ కోరుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని నిజామాబాద్‌ కలెక్టర్‌ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రమాదం పొంచి ఉందని, ‘చేతులెత్తి దండం పెడుతున్నా.. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోండి’ అంటూ నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి ప్రజకు సూచించారు. ఈ మేరకు ఆయన జిల్లా ప్రజలకు ఒక ఆడియో సందేశాన్ని పంపారు.జిల్లాలో ఇంకా లక్షన్నర మంది మొదటి డోస్‌ తీసుకోలేదని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌తో రోగనిరోధకశక్తి పెరిగి థర్డ్‌వేవ్‌ను ఎదుర్కోవచ్చంటూ ఆయన తెలిపారు. లేదంటే ప్రాణాలకు ముప్పు తెచ్చుకొని కుటుంబ సభ్యులకు తీవ్ర శోకాన్ని మిగిల్చినవారమవుతామని.. దయచేసి వ్యాక్సిన్‌ తీసుకోండంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్న నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డిని పలువురు అభినందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img