Tuesday, March 19, 2024
Tuesday, March 19, 2024

జర్మనీ పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతోంది : మంత్రి కేటీఆర్‌

జర్మనీ పెట్టుబడులకు తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలుకుతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హాటల్‌లో జర్మనీ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ, . పరిశ్రమల ఏర్పాటుకు 2 వేల ఎకరాల స్థలం అందుబాటులో ఉందని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు జర్మనీ రూపొందించిన విధివిధానాలు బాగున్నాయని పేర్కొన్నారు. జర్మనీ ప్రభుత్వం, అక్కడి పారిశ్రామికవేత్తలతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. చిన్న తరహా పరిశ్రమలే జర్మనీ జీడీపీ వృద్ధికి సహకరిస్తున్నాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img