Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతున్నా : సీఎం కేసీఆర్‌

జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతున్నానని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆరునూరైనా సరే వందకు వంద శాతం ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు తన సర్వశక్తులు, సకల మేథోసంపత్తిని ఉపయోగించి, చివరి రక్తపు బొట్టు ధారపోసి అయినా సరే ఈ దేశాన్ని చక్కదిద్దుతానని అన్నారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్‌ రిజర్వాయర్‌ ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్‌ ప్రసంగించారు. దేశంలో చాలా దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తోంది. దేశంలో ఉన్నం కాబట్టి వంద శాతం మనం ముందుకు పోవాలి.అసహ్యం పుట్టే పనులు జరుగుతున్నాయి. మతకల్లోలాల పేరిట విధ్వంసం సృష్టిస్తున్నారు. పిల్లలు కర్ణాటక వెళ్లి చదువుకోవాలంటే భయపడుతున్నారు. ఈ దుర్మార్గాన్ని అంతం చేయాలి. బెంగళూరు సిలికాన్‌ వ్యాలీ ఆఫ్‌ ఇండియాగా మారింది. మన హైదరాబాద్‌ రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్‌ నుంచి లక్షా 50 వేల కోట్ల సాఫ్ట్‌వేర్‌ ఎగుమతులు జరుగుతున్నాయి. అంతర్జాతీయ విమానాలు శంషాబాద్‌లో దిగుతున్నాయి. ప్రతి రోజూ 580 వరకు విమానాలు ల్యాండ్‌ అవుతున్నాయి. తెలంగాణలో ఎక్కడా పోయినా ఎకర భూమి 20 లక్షలకు పైగానే ఉంది. మన రైతులు ధనికులయ్యే పరిస్థితి ఉందని అన్నారు. దేశంలో అతి తక్కువ నిరుద్యోగిత ఉన్న రాష్ట్రం తెలంగాణ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రాలు బాగు పడాలంటే కేంద్రంలో కూడా ధర్మంతో పని చేసే ప్రభుత్వం ఉండాలి. కులాలు, మతాల పేరు మీద చిచ్చు పెట్టొద్దు. ప్రశాంత వాతావరణంలోనే పరిశ్రమలు వస్తాయి. మతకల్లోలాల ఉంటే పరిశ్రమలు రావని చెప్పారు. ఇవి దేశానికి ప్రమాదం, మంచిదికాదు. దాన్ని సంహించకూడదు. ఆ క్యాన్సర్‌ను విసర్తించకుండా చర్యలు చేపట్టాలని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img